25, డిసెంబర్ 2013, బుధవారం

శ్రీకృష్ణదేవరాయలు యదువంశీయుడే కాదు



      శ్రీకృష్ణదేవరాయలు యదు వంశీయుడు కాదు యదువు తమ్ముడు తుర్వసుని వంశీయుడు. పారిజాతాపహరణం పీఠికలో నందితిమ్మన చాలా స్పష్టంగా చెప్పాడు. యదువంశీయులకు రాజ్యార్హత లేదని కూడా స్పష్టం చేశాడు. అప్పటి కాలం లో శ్రీ రాయల వారిని సాక్షాత్తూ అ శ్రీకృష్ణుడే శ్రీ కృష్ణదేవరాయలుగా జన్మించాడని అనుకునేవారట. కృతిపతి వంశావళి అంటూ ఆయన కృష్ణుడితో తులానాత్మక వర్ణన చేస్తూ రాశారు. ఈ పద్యాలను సరిగా అర్థం చేసుకోలేని యాదవులని చెప్పుకునే గొల్ల సోదరులు రాయలు గొల్ల కులస్తుడని పొరపాటు పడ్డారు. కొంతమంది కుహనా మేధావులు కేవలం ఒక పద్యం చూపించి రాయలు గొల్ల కులస్తుడే అంటే నమ్మి అనవసరంగా తమది కాని చరిత్రను తమదిగా పొరపాటున చెప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చరిత్ర వాస్తవం అది నిప్పు లాంటిది, అబద్దాల దుప్పటి దానిపై కప్పి మాయ చేయాలని చూస్తే ఆ దుప్పటిని కాల్చుకుని బయటకు వస్తుంది. వాస్తవంగా పారిజాతాపహరణం లో ఏముందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం వుంది. పారిజాతాపహరణం పీటిక కాపీలను ఇక్కడ పెడుతున్నాను గమనించ గలరు. యదువు సంతతి వారిని మాత్రమే యాదవులు అంటారు. తుర్వసుని సంతతి వారిని కాదు. కురు సంతతి వారిని కౌరవులు అంటారు. వీరంతా బంధువులు చంద్రవంశ క్షత్రియులు. వీరు వున్నత కులానికి చెందిన వారే కానీ దిగువ స్థాయి కులాలకు చెందిన వారు కాదు. పారిజాతాపహరణం లో శ్రీరాయల వారి మెప్పుకోలు కొరకు ముక్కుతిమ్మనార్యుడు శ్రికృష్ణుడికి దక్కని అనేక అర్హతలను రాయలవారు అందుకున్నారని 17 వ పద్యం లో చమత్కరించారు. ఈ పద్యాల క్రింద అర్థాన్ని తాత్పర్యాన్ని కూడ గమనించగలరు.

సేకరణ: పోలిశెట్టి సత్తిరాయుడు గారు, హైదరాబాదు

















7 కామెంట్‌లు:

  1. On the page 16 it was clearly written that krishnaraya was born in yaduvamsa or yadu kula.

    రిప్లయితొలగించండి
  2. మీకు తెలుగు రాదు అనేది అందుకే. యదువు తమ్ముడు తుర్వసుని వంశస్తుడని రచయితనే పేర్కొంటే. "అదిగో 16 వ పేజీ లో యదుకులము అని వుంది చూడమంటారు. తెలుగు భాష చాలా విస్తృతమైనది ఉపమానాలు, శ్లేషలు వంటి ప్రయోగాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మొత్తం భావాన్ని అర్థం చేసుకుని అన్వయించుకోవాల్సి వుంటుంది.

    అయినా మీ తమ్ముని కొడుకు మీ కొడుకెలా అవుతాడండీ?

    మీ తమ్ముని వంశము మీ తమ్ముడిదే అవుతుంది కానీ మీ వంశమెలా అవుతుంది?

    ఇన్ని ఆధారాలు ఇస్తున్నప్పటికీ మీరు మిడి మిడి జ్ఞానం తో వాదించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

    పద్యం రాసేటప్పుడు చందస్సు లో మాత్రలు కుదరక పోయినప్పుడు అందుబాటులో ఉన్న పదాలను కవులు వాడుతారు పాపం నంది తిమ్మన గారు కూడా అలాగే వాడివుంటారు. భవిష్యత్తులో మీ లాంటి వారు తన రాతలకు ఇలాంటి విపరీతార్థాలు తీస్తారు అనుకుని వుంటే పాపం జాగ్రత్త పడి వుండే వారు.

    మనుచరిత్ర పీఠిక లో అల్లసాని పెద్దన రాసిన పద్యాలు 18 నుండి 22 వరకు చదవండి. భగవంతుడు మీకు కాస్త జ్ఞానాన్ని ప్రసాదించుగాక...

    రిప్లయితొలగించండి
  3. పేజి 16 లో ఈ లైను అర్ధమేమి ?

    యాదవాన్వయమునందు =కృ. యాదవ కులమున, కృ.రా.యయాత్యగ్రసుతుడగు యదువు యొక్క వంశమున

    రిప్లయితొలగించండి
  4. గురువు గారు .. చరిత్ర తెలుసుకోవాలని అభిలాషయే గాని ఎవరు ఏ కులము ఇనా ఒరిగేది ఏమి ఉండదు
    కాని కొంతమంది జనాల్ని చూసినప్పుడు వారు ప్రవర్తించే తీరు ఎలా ఉంటదంటే...? నేను ఈ కులం లో పుట్టాను గాబట్టి నేను గొప్పోడిని అన్న విపరీత భావం... అది జుగుప్స కల్లిగిస్తుంది
    కులాలు మన వాళ్ళు ఎర్పరుచుకున్నది బ్రతకటానికి చంపుకోవటానికి కాదు కదండి!..

    రిప్లయితొలగించండి
  5. గొప్పదనము ఖచ్చితంగా కులం వల్ల కలగదు...కేవలం గుణము వల్ల మాత్రమే లభిస్తుంది. కొంతమంది చరిత్రను కబ్జాచేస్తూ వక్రీకరిస్తుంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే చరిత్ర ప్రతి జాతికీ చాలా అవసరము అది తరువాతి తరాలకు స్పూర్తినిస్తుంది. కొన్ని జాతులు ఓర్చలేక చరిత్రను వివాదాస్పదం చేస్తున్నాయి. రాయలు సంపెట అనే ఇంటిపేరు గలవాడని అందరికీ తెలుసు రాయలకంటే ముందు చాలామంది వారి వంశస్తులు సామంతులుగా ...దండనాయకులుగా రాజ్యాలేలారు, పదవులూ నిర్వహించినటులు చరిత్ర చెబుతోంది. కానీ కొంతమంది రాయలవారి కులం గురించి కావాలని వివాదాలు రేకెత్తిస్తున్నారు. అది సరైన పద్దతి కాదుగా...

    రిప్లయితొలగించండి
  6. ప్రపంచం లో ఎక్కడా లేని ఈ దారుణ అమానుష కుల వ్యవస్థ మనదేశం లో ఏర్పరిచిన దౌర్భాగ్యులు ఎవరో తెలీదు కానీ దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం..
    కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, బీద ధనిక అని తెలీయని అడ్డంకులను మనసుల మధ్య ఏర్పరుచుకుని మనిషి తత్వాన్ని కోల్పోయి మృగత్వాన్ని సంతరించుకుని అవసరం లేని ఆధిపత్య ధోరణితో మనిషిని మనిషే చంపుకునే బృహత్తర స్థాయికి చేరుకున్నందుకు మిక్కిలి దుఃఖిస్తున్నాను.
    చరిత్ర అంటే మన (మన అంటే కుల మతాలకు అతీతం గా) పూర్వికులు చేసిన మంచిపనులు సారాంశం) వాటిని గ్రహించి వారి స్థాయిని పెంచే విధంగా ప్రవర్తించటం మన కర్తవ్యం.

    శ్రీ కృష్ణదేవరాయలు దేశం గర్వించదగ్గ కవిరాజు. ఆయన ఏ ఒక్క కులానికో మతానికో రాజు కాదు (మనిషి అన్న తరువాత యాదృచ్చికంగా ఏదో ఒక కులం లో పుడతాడు, పుట్టక ముందే మనకు ఈ లోకం లో ఉండే కులాల గురించి సమాచారం ఉండదుగదా..!
    అలా ఉంటే ప్రతి వాడు పుట్టే ముందే కులాన్ని ఎంపిక చేసుకునేవాళ్ళు గదా !). ఒక మనిషి ఒక ఆశయం కోసమో లేదా ఒక లక్ష్యం కోసం పోరాడి గొప్పవాడై తారాస్థాయి కి చేరుకుంటే ఆ మనిషి అందరివాడు అవుతాడు అతను ఏ కులానికి సంభందించిన వాడు కాదు. అదే కోవకు చెందిన వారు మన సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, గౌతమ బుద్ధ, వివేకానంద,శ్రీ కృష్ణ దేవరాయలు. చరిత్ర, మంచితనం ఎవరో కబ్జా చేస్తే అయిపోవండి.
    చెట్టు పేరుచెప్పి కాయలు అమ్ముకునే ప్రక్రియను మానుకుని మన పూర్వికులు మనకు అందచేసిన మంచిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించే దిశగా ప్రయాణించగలిగితే భవిషత్తులో ఐనా కులాల కుమ్ములాటలు రిజర్వేషన్ రాజకీయాలు సమసిపోయే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  7. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన గురించి మనం తెలుసుకోలేక పోవడమే...కులవ్యవస్థ అమానుష వ్యవస్థ కాదు మిత్రమా...అది చాలా అధునాతన వ్యవస్థ...అభివృద్ధి చెందిన వర్క్ డివిజన్...ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుత వ్యవస్థ. కొన్ని వేల సంవత్సరాలు భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానం లో నిలబెట్టిన వ్యవస్థ. తెల్ల వాడి పుణ్యమా అని మన కట్టుబాట్లను మనం మరచిపోయాము. అందుకే మనదైన గొప్ప వ్యవస్థ మీకు చెత్తగా కనిపిస్తోంది. భారత దేశం లో కులం లేకుండా చరిత్ర లేదు. ఇక రాయల వారి గురించి మీరు చెప్పింది సమంజసమే...కానీ తప్పుడు చరిత్ర ప్రజల ముందుకు పోకూడదు కదా...అందుకే అసలైన చరిత్ర ప్రజల ముందు పెట్టాము. ఇక చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అనే పదం మీ లోని అసహనాన్ని వ్యక్త పరుస్తోంది. తప్పుడు ప్రచారాలతో లబ్ది పొందాలనే శ్రీకృష్ణదేవరాయలు అనేవ్యక్తిని శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అంటూ కించపరుస్తున్నారు. వాటిని ఖండించడానికే ఈ ఆధారాలు పెట్టాము అంతే తప్ప ఇతర కులస్తులపై అసహనం ద్వేషం వెళ్ళగక్కడానికి కాదు....

    రిప్లయితొలగించండి